అక్షయ్‌తో రకుల్‌?

బాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రభ వెలిగిపోతోంది. ఇప్పటికే ఆమె పలువురు అగ్రహీరోల సరసన నటిస్తున్నారు. తాజాగా అక్షయ్‌కుమార్‌ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశాన్ని రకుల్‌ దక్కించుకున్నారని బాలీవుడ్‌ సమాచారం. ‘బెల్‌బాటమ్‌’ దర్శకుడు రంజీత్‌ తివారి చెప్పిన కథ అక్షయ్‌కు బాగా నచ్చిందట. శ్రద్ధాకపూర్‌, కియారాను సంప్రదించినా చివరకు రకుల్‌ను కథానాయికగా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. 40 రోజుల పాటు ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ‘బెల్‌బాటమ్‌’ నిర్మాత జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. రకుల్‌ హిందీలో ‘మేడే’, ‘థాంక్‌ గాడ్‌’, ‘డాక్టర్‌ జీ’, ‘ఛాత్రీవాలి’ సినిమాల్లో నటిస్తున్నారు.  

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.