బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చేతికి 'రాక్షసుడు' హిందీ రీమేక్ రైట్స్ వెళ్ళినట్టు తెలుస్తోంది. తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ సినిమా 'రాక్షసన్'. సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమా, నిర్మాతకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇదే సినిమాను తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో 'రాక్షసుడు'గా రూపొందించారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలల్లో మంచి లాభాలను తెచ్చిన ఇదే. ఇక ఈ సినిమా హనీశ్ హిందీ రీమేక్ రైట్స్ కూడా ఆయనే తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో రీమేక్ అనుకున్నారు. అయితే కరోనా కారణంగా బాగా పరిస్థులన్నీ మారిపోయాయి. దాంతో 'రాక్షసుడు' హిందీ రీమేక్ డ్రాపయి.. హిందీ రైట్స్ అక్షయ్కి ఇచ్చేశారట. ఆయన తన సొంత బ్యానర్లో 'రాక్షసుడు' హిందీ రీమేక్ నిర్మించబోతున్నారని సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.