Rakhi Sawant: మీరు ఈ దేశంలోని అమ్మాయిలకు మంచి చేశారు.. రణ్‌వీర్‌సింగ్‌ న్యూడ్ పిక్స్‌పై స్పందించిన బోల్డ్ బ్యూటీ

Twitter IconWatsapp IconFacebook Icon
Rakhi Sawant: మీరు ఈ దేశంలోని అమ్మాయిలకు మంచి చేశారు.. రణ్‌వీర్‌సింగ్‌ న్యూడ్ పిక్స్‌పై స్పందించిన బోల్డ్ బ్యూటీ

బాలీవుడ్‌ (Bollywood)లో ఐటం సాంగ్స్‌తో పేరు సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్ (Rakhi Sawant). అంతేకాకుండా బిగ్‌బాస్ వంటి పలు రియాలిటీ షోలలో పాల్గొని అలరించింది. ఈ బ్యూటీ చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్ అనే విషయం తెలిసిందే. ఏ విషయం గురించైనా ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. తాజాగా సైతం రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) న్యూడ్ పిక్స్‌పై తన అభిప్రాయాన్ని తెలిపింది. దానికి సంబంధించిన వీడియోని రాఖీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అందులో రాఖీ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడే దుబాయ్ నుంచి తిరిగి వచ్చాను. ఇక్కడ దిగగానే అందరి నోటి నుంచి రణ్‌వీర్ సింగ్ న్యూడ్ పిక్స్ గురించే వింటున్నాను. కెమెరా ముందు నగ్నంగా పోజులిచ్చి దేశంలోని అమ్మాయిలకు రణ్‌వీర్ మేలు చేశాడు. కనీసం ఒక వ్యక్తిని ఇలా చూసినందుకు ప్రశాంతంగా అనిపించింది. నిజం చెప్పాలంటే.. ఆ పిక్స్‌లో రణ్‌వీర్ చాలా అందంగా ఉన్నాడు. డియర్ ఫ్రెండ్ రణ్‌వీర్ ఎక్కడ ఉన్నావు. ఇలాంటి ఫోటోషూట్‌లు మీరు మరిన్నీ చేయాలి’ అని చెప్పుకొచ్చింది. 


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు స్సందిస్తూ కొందరు రాఖీ సావంత్‌ మాటలకి సపోర్టు చేస్తుండగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ‘నువ్వు పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తావని నాకు తెలుసు. అందుకే రణ్‌వీర్‌కి సపోర్టు చేస్తున్నావు’ అంటూ కొందరు.. ‘అంటే అదిల్‌లో నీ ప్రేమ అబద్ధమా’ అని మరికొందరు.. ‘ఇది వింటే అదిల్ పరిస్థితి ఏంటి’ అంటూ కొందర ఫన్నీగా, కొందరు సీరియస్‌గా కామెంట్స్ చేస్తున్నారు.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.