తాను ధరించే దుస్తులు బాయ్ ఫ్రెండ్‌కు నచ్చడం లేదంటున్న Rakhi Sawant
ABN , First Publish Date - 2022-06-30T21:50:44+05:30 IST
బాలీవుడ్‌లో పలు రియాలిటీ షోల్లో పాల్గొనడంతో పాటు ఐటం సాంగ్స్‌తో ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్ (Rakhi Sawant). కొన్ని రోజుల క్రితం భర్త రితేశ్‌కు విడాకులిచ్చారు. దంపతులుగా
బాలీవుడ్‌లో పలు రియాలిటీ షోల్లో పాల్గొనడంతో పాటు ఐటం సాంగ్స్‌తో ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్ (Rakhi Sawant). కొన్ని రోజుల క్రితం భర్త రితేశ్‌కు విడాకులిచ్చారు. దంపతులుగా విడిపోయాక ఆయన టాటును కూడా తొలగించారు. అనంతరం కొత్త లవర్‌ను వెతుకున్నారు. బిజినెస్ మ్యాన్ ఆదిల్ ఖాన్ దుర్రానీ(Adil Khan Durrani)తో చెట్టాపట్టాలెసుకుని తిరుగుతున్నారు. ఈ జంటకు ఇప్పటికే నిశ్చితార్థం అయింది. ఆమె త్వరలోనే ఆదిల్‌ను పెళ్లి చేసుకొబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
రాఖీ సావంత్ ఈ మధ్య ముంబైలో ఎక్కడ కనిపించినా బాయ్ ఫ్రెండ్ ఆదిల్ గురించే చెబుతున్నారు. తాను ధరించే దుస్తులు ఆదిల్‌కు నచ్చడం లేదని తాజాగా ఆమె తెలిపారు. ‘‘గతంలో ఇష్టం వచ్చినట్టు దుస్తులు వేసుకునేదానిని. ప్రస్తుతం పద్ధతిగా వేసుకోవడం నేర్చుకున్నాను. అందుకు ఆదిలే కారణం. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. అందువల్లే ఆదిల్ మాటలను వింటాను. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. నా మాట కూడా వింటారు. కురచ దుస్తులు ధరించకుండా హీరోయిన్ కావచ్చు అని నాకు తెలిసింది. పొట్టి దుస్తులు ధరించిందడానికి ఆయన అడ్డు చెప్పడం లేదు. కురచ దుస్తులను వేసుకోమని కూడా చెబుతారు. కానీ, ఎద అందాలను చూపించడం ఆదిల్‌కు ఇష్టం ఉండదు’’ అని రాఖీ సావంత్ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. రాఖీ సావంత్ భర్త రితేష్ సింగ్ నుంచి విడిపోతున్నట్టు ఫిబ్రవరి 14న చెప్పారు. సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేశారు.