యంగ్ టైగర్ సినిమాలో యాంగ్రీమేన్ ?

ABN , First Publish Date - 2022-01-11T17:10:46+05:30 IST

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం తర్వాత కొరటాల దర్శకత్వంలో తన 30వ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు యన్టీఆర్. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు దర్శకుడు. చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. కథానాయికగా కియారా అద్వానీ పేరు వినిపిస్తుండగా.. మరో ముఖ్యమైన పాత్ర కోసం యాంగ్రీమేన్ రాజశేఖర్ ను ఎంపిక చేయబోతున్నారని సమాచారం. ఇందులో యన్టీఆర్ బాబాయ్ పాత్రను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట కొరటాల. అది రాజశేఖర్ కు చాలా యాప్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. రాజశేఖర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట.

నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ 22న సినిమాని విడుదల చేయబోతున్నట్టు సినిమా అనౌన్స్ మెంట్ రోజునే ప్రకటించారు నిర్మాతలు. కానీ యన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి, కొరటాల ‘ఆచార్య’ సినిమాకి లాక్ అయిపోవడం.. ఆ సినిమాలు కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడడం జరగడంతో యన్టీఆర్ 30 ఇంతవరకూ సెట్స్ పైకే వెళ్ళలేకపోయింది.  అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో రాజశేఖర్ నటించనుండడం మరింత విశేషంగా మారింది. ఇంతకు ముందు యన్టీఆర్ తో తీసిన  ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు పవర్ ఫుల్ రోల్ ఇచ్చిన కొరటాల.. మళ్ళీ యన్టీఆర్ తోనే తీయబోతున్న చిత్రంలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కు పవర్ ఫుల్ ఇవ్వబోతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. మరి నిజంగానే రాజశేఖర్ యన్టీఆర్ తో స్ర్కీన్ షేర్ చేసుకుంటారో లేదో చూడాలి.  

Updated Date - 2022-01-11T17:10:46+05:30 IST