బాలీవుడ్లో విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజ్ కుమార్ రావ్ (Rajkummar Rao). ‘స్త్రీ’, ‘లూడో’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించాడు. గత ఏడాది ప్రియురాలైన పత్ర లేఖ (Patralekha) ను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట జుహు ప్రాంతంలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌ను బాలీవుడ్ హీరోయిన్ నుంచి కొనడం చెప్పుకోదగ్గ విశేషం.
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జుహు-విల్లే పార్లే అభివృద్ధి పథకం కింద ఓ భవనంలో 14, 15, 16వ ఫ్లోర్లను కొనుగోలు చేసింది. జాన్వీ ఈ ఫ్లోర్ల కోసం 2020లో రూ.39కోట్లను వెచ్చించింది. ఈ ఫ్లోర్ల కొనుగోలులో భాగంగా ఆమెకు ఆరు పార్కింగ్ స్లాట్లు లభించాయి. ఈ అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ జులై 21, 2002న జరిగినట్టు తెలుస్తోంది. అందుకు గాను రాజ్ కుమార్ రావ్, పత్ర లేఖ రూ. 2.19 కోట్లను స్లాంప్ డ్యూటీగా చెల్లించారు. ఈ అపార్ట్మెంట్ కొనుగోలుతో ముంబైలో విలాసవంతమైన భవనాలను సొంతం చేసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీల చెంత రాజ్ కుమార్ రావ్ చేరాడు. ఈ భవంతిలోనే షారూఖ్ ఖాన్, కాజోల్‌లకు ప్లాట్లున్నాయి. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రాజ్ కుమార్ రావ్ చివరగా.. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (HIT: The First Case)లో నటించాడు. ఈ చిత్రంలో సాన్యా మల్హోత్రా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ‘భీడ్’, ‘మోనికా’, ‘ఓ మై డార్లింగ్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ వంటి ప్రాజెక్టులు కూడా రాజ్ కుమార్ చేతిలో ఉన్నాయి.