Annathe : ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్

ABN , First Publish Date - 2021-10-21T21:26:34+05:30 IST

‘తలైవా’ రజనీకాంత్ ఎర్లియర్ గా ‘దర్బార్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆ సినిమా ఆశించిన రీతిలో అలరించకపోవడంతో అభిమానులు నిరాశచెందారు. అయితే ఈ ఏడాది ‘అన్నాత్త’ మూవీతో రజినీకాంత్ మాస్ జనానికి పూనకం తెప్పించబోతున్నట్టు టీజర్ తోనే క్లూ ఇచ్చారు. అందులో ఆయన పలికిన డైలాగ్స్ కు, ఫైట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా బాగా వచ్చినట్టు కోలీవుడ్ రిపోర్ట్. మాస్ దర్శకుడు శివ రూపొందించిన ఈ సినిమా తెలుగులో పెద్దన్నగా విడుదల కానుంది.

Annathe : ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్

‘తలైవా’ రజనీకాంత్ ఎర్లియర్ గా ‘దర్బార్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆ సినిమా ఆశించిన రీతిలో అలరించకపోవడంతో అభిమానులు నిరాశచెందారు. అయితే ఈ ఏడాది ‘అన్నాత్త’ మూవీతో రజినీకాంత్ మాస్ జనానికి పూనకం తెప్పించబోతున్నట్టు టీజర్ తోనే క్లూ ఇచ్చారు. అందులో ఆయన పలికిన డైలాగ్స్ కు, ఫైట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా బాగా వచ్చినట్టు కోలీవుడ్ రిపోర్ట్. మాస్ దర్శకుడు శివ రూపొందించిన ఈ సినిమా తెలుగులో పెద్దన్నగా విడుదల కానుంది. దీపావళి కానుకగా.. నవంబర్ 4న విడుదల కానున్న ‘అన్నాత్త’ మూవీ తెలుగులో కూడా అదే రోజున రిలీజవుతోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఖుష్బు, మీనా, కీర్తిసురేశ్, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ఇక ఈ సినిమాను ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. మరే ఇతర ఇండియన్ సినిమాను విడుదల చేయని లొకేషన్స్ లో సైతం ఈ సినిమా విడుదల కానుండడం విశేషం. 



రజినీ సినిమాలు అమెరికాలోనే కాకుండా చైనా, జపాన్ లాంటి దేశాల్లో విడుదలవుతుంటాయి. అలాగే.. మిగతా కంట్రీస్ లోనూ ఆయనకి  భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ‘అన్నాత్త’ మూవీని రికార్డు స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని టాక్. కొంతకాలంగా సక్సెస్ పరంగా వెనుకబడిన రజినీ కాంత్ ‘అన్నాత్త’ తో  మళ్లీ కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ గా మారతారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మరి కోలీవుడ్ దీపావళికి ప్రపంచ వ్యాప్తంగా ‘అన్నాత్త’ మెరుపులే అన్నమాట. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ అవుతుందో చూడాలి.    

Updated Date - 2021-10-21T21:26:34+05:30 IST