చెన్నై చేరుకున్న తలైవా.. ఆనందంలో ఫ్యాన్స్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఇటీవల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన చెకప్‌ కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. మూడు వారాల పాటు అమెరికాలో చెకప్స్‌ చేసుకున్న తలైవా చెన్నై చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు లాబీకి చేరుకున్న రజినీకాంత్‌ను చూడగానే ఆయన అభిమానులు హంగామా చేశారు. అభిమానులకు అభివాదం చేసిన రజినీకాంత్‌ అక్కడ నుంచి ఇంటికి చేరుకున్నారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రజినీకాంత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'అణ్నాత్త'. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను, డబ్బింగ్‌ను రజినీకాంత్‌ అమెరికాకు వెళ్లక ముందే పూర్తి చేసేశారు. ఈ ఏడాది దీపావళి సందర్బంగా నవంబర్‌ 4న సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. తదుపరి రజినీకాంత్‌ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతుంది. కుమార్తె సౌందర్య దర్శకత్వంలోనే రజినీకాంత్‌ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.