డిజిటలైజేషన్‌తో రీ-రిలీజ్‌కి సిద్ధమైన రజనీ మూవీ

ABN , First Publish Date - 2022-11-22T14:41:50+05:30 IST

రెండు దశాబ్దాల క్రితం 2002లో విడుదలైన చిత్రం ‘బాబా’ (Baba). తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (RajiniKanth) కథ, స్ర్కీన్‌ప్లే సమకూర్చి సొంతంగా నిర్మించారు..

డిజిటలైజేషన్‌తో రీ-రిలీజ్‌కి సిద్ధమైన రజనీ మూవీ

రెండు దశాబ్దాల క్రితం 2002లో విడుదలైన చిత్రం ‘బాబా’ (Baba). తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (RajiniKanth) కథ, స్ర్కీన్‌ప్లే సమకూర్చి సొంతంగా నిర్మించారు. ‘అన్నామలై’, ‘వీరా’, ‘బాషా’ వంటి సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అందించిన సురేష్‌ కృష్ణ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటి మనీషా కోయిరాలా (Manisha Koirala) హీరోయిన్‌. ఇతర పాత్రల్లో గౌండమణి, ఢిల్లీ గణేష్‌, సుజాత, ఎంఎన్‌.నంబియార్‌, కరుణాస్‌, సంఘవి తదితరులు నటించగా ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూర్చారు.


మహా అవతార్‌ బాబాజీని ఇతివృత్తంగా చేసుకుని రూపొందించారు. ఈ చిత్రాన్ని డిజిటలైజేషన్‌ చేసి మళ్ళీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన టెక్నాలజీతో ప్రతి ఒక్క ఫ్రేమ్‌తో పాటు పాటల సన్నివేశాలను సైతం కలర్‌ గ్రేడింగ్‌ చేస్తున్నారు. కొత్త మెరుగులు దిద్దుకోనున్న ఈ చిత్రం రీ రిలీజ్‌ తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.



Updated Date - 2022-11-22T14:41:50+05:30 IST