‘తలైవి’ చిత్ర బృందానికి రజనీ ప్రశంస

మాజీ ముఖ్యమంత్రి దివగంత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించి, ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేసిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్ర పోషించగా, ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి, కరుణానిధిగా నాజర్‌, ఆర్‌ఎం వీరప్పన్‌గా సముద్రఖని నటించారు. ఏఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కంగనా, అరవింద్‌ స్వామి అద్భుతంగా నటించారంటూ ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజాగా వీక్షించి దర్శకుడు విజయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. చిత్రాన్ని బాగా చిత్రీకరించాంటూ రజనీకాంత్‌ మనస్పూర్తిగా అభినందించడంతో చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది.

Otherwoodsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.