రజనీకాంత్ అమెరికా నుంచి తిరిగొచ్చారు. గురువారం రాత్రి చెన్నై చేరుకున్నారు. ప్రతి ఏడాది కనీసం ఒకసారైనా మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్లిరావడం రజనీకాంత్‌కు అలవాటు. గతేడాది కరోనా కారణంగా వెళ్లలేకపోయారు. అందువల్ల, ఈసారి ప్రత్యేక అనుమతులు తీసుకుని జూన్ 19న అమెరికా వెళ్లారు. మధ్యలో ఓసారి ఫ్లోరిడాలోని మయో క్లినిక్ వెలుపల కనిపించారు. కొందరు అభిమానులకు ఆయన్ను కలిసే అవకాశం లభించింది.
ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. మెడికల్ చెకప్ పూర్తి చేసుకున్న రజనీకాంత్, సుమారు 20 రోజుల తర్వాత ఇండియాకు వచ్చారు. సినిమాలకు వస్తే... ఆయన కథానాయకుడిగా నటించిన ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుంది. రజనీ రాకతో త్వరలో ఈ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోందని సమాచారం.