దేవికకు సాయం చేయండి – రాజమౌళికి కౌంటర్లు!

ABN , First Publish Date - 2022-01-29T19:39:25+05:30 IST

‘బాహుబలి’ చిత్రానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు కో–ఆర్డినేటర్‌గా పని చేసిన దేవిక అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని ఆమెకు సాయం చేయాలంటే దర్శకుడు రాజమౌళి ట్వీట్‌ చేశారు. ఈ మేరకు దేవికకు సంబంఽధించిన ఫొటోలు షేర్‌ చేసి ‘‘దేవిక ‘బాహుబలి’ చిత్రానికి చాలా వర్క్‌ చేసింది. పని పట్ల ఆమెకున్న డెడికేషన్‌ గురించి మాటల్లో చెప్పలేను.

దేవికకు సాయం చేయండి – రాజమౌళికి కౌంటర్లు!

‘బాహుబలి’ చిత్రానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు కో–ఆర్డినేటర్‌గా పని చేసిన దేవిక అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని ఆమెకు సాయం చేయాలంటూ దర్శకుడు రాజమౌళి ట్వీట్‌ చేశారు. ఈ మేరకు దేవికకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసి ‘‘దేవిక ‘బాహుబలి’ చిత్రానికి చాలా వర్క్‌ చేసింది. పని పట్ల ఆమెకున్న డెడికేషన్‌ గురించి మాటల్లో చెప్పలేను. దురదృష్టవశాత్తు ఆమె బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతుంది. దయచేసి ఆమెకు సాయం చేయడానికి ముందుకు రండి’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 


దేవిక ఓ మధ్య తరగతి మహిళ. ఓసారి క్యాన్సర్‌తో బాధపడి కోలుకున్నారు. తన పెద్ద కుమారుడు అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాడు. కుటుంబ పోషణ, కుమారుడి వైద్యం ఖర్చుల కోసం భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. కిడ్నీ సమస్యతో భర్త మరణించారు. కుటుంబ బాధ్యత మొత్తం తనపై పడిన సమయంలోనే ఆమెపై క్యాన్సర్‌ మరోసారి దాడి చేసింది. చికిత్సకు సుమారు రూ. 3 కోట్లు ఖర్చవుతోంది. ఈ కథ తెలుసుకున్న ఓ ఆన్‌లైఫ్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ సంస్థ దేవికకు సాయం చేయడానికి ముందుకొచ్చి ఆమె కథను ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి దేవిక పరిస్థితిని వివరించి సాయం చేయాలని కోరారు. 


రాజమౌళికి కౌంటర్లు... 

అయితే రాజమౌళీ ట్వీట్‌ను కొందరు పాజిటివ్‌గా తీసుకుంటే మరికొందరూ నెగటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. ‘‘భారీ బడ్జెట్‌ చిత్రాలు తీస్తూ కోట్లలో రెమ్యునరేషన్‌ తీసుకునే మీరు సాయం చేయకుండా ఇలా డొనేషన్లు అడుగుతారా? మీ సినిమాల్లో చూపించే ఎమోషన్స్‌ మీకు లేవా? ముందు మీరెంత ఎంత సాయం చేశారో చెప్పి తర్వాత ఇతరులను సాయం అడగిండి’’ అని ఓ నెటిజన్‌ రాజమౌళిపై  కామెంట్‌ చేశారు. 




Updated Date - 2022-01-29T19:39:25+05:30 IST