రాజమౌళిని నమ్మాను!
ABN , First Publish Date - 2022-04-01T08:47:24+05:30 IST
తెలుగులో ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాల కథానాయికగా ఓ మెరుపు మెరిశారు శ్రియ. ఇప్పటికీ.. ఆమె స్థాయికి తగిన పాత్రలు వస్తూనే ఉన్నాయి.

తెలుగులో ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాల కథానాయికగా ఓ మెరుపు మెరిశారు శ్రియ. ఇప్పటికీ.. ఆమె స్థాయికి తగిన పాత్రలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ‘గమనం’లో అభినయ ప్రాధాన్యమున్న పాత్ర పోషించారు. తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’లోనూ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఆమె నిడివి చాలా తక్కువ. అయినా సరే... తను ఈ సినిమాలో భాగం కావడానికి ఒప్పుకొన్నారు. ‘‘ఓ గొప్ప ప్రాజెక్టులో నా పేరు కూడా ఉంటే... అంతకంటే సంతోషం ఏముంటుంది? రాజమౌళి సినిమా అనగానే ఇంకేం ఆలోచించలేదు. హీరోలు ఎవరు? కథేంటి? నా పాత్ర ఏమిటని కూడా అడగలేదు. రాజమౌళిని అంత నమ్మాను. ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి అంతా గొప్పగా మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంది. అసలైన విచిత్రం ఏమిటంటే.. ఈ సినిమా ఇప్పటి వరకూ నేను చూడలేదు. తొలి రోజు చూద్దామనుకొన్నా. కానీ ఎక్కడ చూసినా హోస్ ఫుల్ బోర్డులే కనిపించాయి. నాక్కూడా టికెట్లు దొరకని పరిస్థితి. త్వరలోనే మా కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తా’’ అని చెప్పుకొచ్చారామె.