నా కన్నా వాళ్ల క్రియేటివిటీ గొప్పది: రాజమౌళి!

ABN , First Publish Date - 2022-03-22T20:12:12+05:30 IST

ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రకటించిన రోజు నుంచి నేటి వరకూ ఈ చిత్రం మీద పాజిటివ్‌, నెగటివ్‌ మీమ్స్‌ వస్తూనే ఉన్నాయి. అభిమానులు–నెటిజన్లు: ఈ ఏడాది ప్రకటిస్తే... వచ్చే ఏడాది షూటింగ్‌.. ఆ తర్వాతి సంవత్సరం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌... వాటిని మెరుగులు దిద్ది.. సీజీ పూర్తి చేయడానికి మరో ఆరు నెలలు... ప్రమోషన్‌ ప్లానింగ్‌.. ఈవెంట్లు. ఓ ఆరు నెలలు మొత్తం మీదు ఓ నాలుగైదేళ్లు జక్కన్నకు వదిలేయాల్సిందే’ అంటూ నెటిజన్లు–అభిమానులు షెడ్యూల్‌ వేసేసుకున్నారు.

నా కన్నా వాళ్ల క్రియేటివిటీ గొప్పది: రాజమౌళి!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రకటించిన రోజు నుంచి నేటి వరకూ ఈ చిత్రం మీద పాజిటివ్‌, నెగటివ్‌ మీమ్స్‌ వస్తూనే ఉన్నాయి.

అభిమానులు–నెటిజన్లు: ఈ ఏడాది ప్రకటిస్తే... 

వచ్చే ఏడాది షూటింగ్‌.. 

ఆ తర్వాతి సంవత్సరం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌... 

వాటిని మెరుగులు దిద్ది.. సీజీ పూర్తి చేయడానికి మరో ఆరు నెలలు... 

ప్రమోషన్‌ ప్లానింగ్‌.. ఈవెంట్లు. ఓ ఆరు నెలలు 

మొత్తం మీదు ఓ నాలుగైదేళ్లు జక్కన్నకు వదిలేయాల్సిందే’ అంటూ నెటిజన్లు–అభిమానులు షెడ్యూల్‌ వేసేసుకున్నారు. అనుకున్నట్లుగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలకు నాలుగేళ్లు సమయం పట్టింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజమౌళి స్టార్‌ హీరోతో సినిమా అంటే మినిమం మూడేళ్లు మరో సినిమా జోలికి వెళ్లే ప్రస్తావనే ఉండదు.  అలాంటిది ఇద్దరు స్టార్‌ హీరోలు ఈ చిత్రంలో నటిస్తున్నారు అంటే  దాదాపు మూడేళ్లు వారు తెరపై కనిపించరు. సినిమాలో వారి లుక్‌ రివీల్‌ కాకూడదని జక్కన్న రాజమౌళి బయట కార్యక్రమాలకు కూడా వెళ్లనివ్వరు. అలా తమ హీరోలను తెరపై చూసుకోవడానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల ఆలస్యం అయ్యేసరికి వారి కోపం కట్టలు తెంచుకుంది. ఆ సమయంలోనే వారి ఫ్రస్టేషన్‌ను మీమ్స్‌గా క్రియేట్‌ చేసి రాజమౌళిపై సంధించారు. ఇందులో కొందరు రాజమౌళిని ప్రశంసిస్తే.. కొందరు విమర్శించారు. ‘మూడేళ్లు దాటుతోంది మా హీరోలను ఇకనైనా వదులుతావా లేదా జక్కన్న అంటూ మీమ్స్‌ క్రియేట్‌ చేశారు. 




ఇక సినిమాలో ఫస్ట్‌లుక్‌, టీజర్లు, ట్రైలర్లు పాటలు విడుదలైనప్పుడు సహజంగా కంపేర్‌ చేస్తు ఫ్యాన్స్‌, యాంటీ ఫ్యాన్స్‌ మీమ్స్‌ చేస్తుంటారు. ఈ కారణాలు కాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంపై మీమ్స్‌ రావడానికి మరో ముఖ్య కారణం ఉంది. అదే సినిమా విడుదల! రిలీజ్‌ అనుకున్నప్పటి నుంచీ ఏదో ఒక సమస్య. కరోనా.. లాక్‌డౌన్‌ థియేటర్ల మూత, టికెట్‌ ధరల సమస్య ఇలా ఎన్నో కారణాలతో సినిమా విడుదల వాయిదా పడటానికి కారణం అయ్యాయి. ఇప్పుడు ఎట్టుకేలకు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 



ఈ సందర్భంగా రాజమౌళి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీమర్స్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. మీమర్స్‌ తనకంటే చాలా గ్రేట్‌ అని ప్రశంసించారు. ‘‘నిజంగా మీమర్స్‌ పర్ఫెక్షన్‌ని మెచ్చుకోవాలి. వాళ్ల టైమింగ్‌, పర్ఫెక్షన్‌ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది నేను ఏళ్ల తరబడి సినిమాలు తీస్తాను. కానీ వాళ్లు అలా కాదు. ట్రైలర్‌ ఇలా వచ్చింది అంటే దానికి సింక్‌ అయ్యేలా గంటల్లో మీమ్స్‌ తయారు చేసేస్తారు. మార్చి 25 తర్వాత కూడా మీమ్స్‌ రూపంలో నన్ను ఆడుకుంటూనే ఉంటారు. నేను ఏం చేసినా వాళ్లకు పండగే. ఈ నెల 25 తర్వాత ‘నెక్ట్స్‌ సినిమా ఎప్పుడు? ఎన్నేళ్లు పడుతుంది? అంటూ మొదలుపెడతారు. మీమర్స్‌ షెడ్యూల్‌ని బట్టే నా సినిమా డేట్స్‌ అనుకుంటున్నట్లు ఉంది నా పరిస్థితి’’ అని అన్నారు. 











Updated Date - 2022-03-22T20:12:12+05:30 IST