తారక్ చక్కిలిగింత.. జక్కన్న చమత్కారం.. చెర్రీ సపోర్ట్!
ABN , First Publish Date - 2021-12-11T22:05:45+05:30 IST
రామ్‌చరణ్, తారక్ స్టార్ హీరోలు అయినప్పటికీ వ్యక్తిగతంగా వారిద్దరూ మంచి స్నేహితులని రాజమౌళి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన సెట్‌లో జరిగిన సరదా అల్లర్లను పంచుకున్నారు. హీరోలిద్దరూ సెట్‌లో ఎలా ఉంటారో రాజమౌళి సరదాగా చెబుతున్న సమయంలో పక్క కుర్చీలో కూర్చున్న తారక్ ఆయనకు చక్కిలిగింత పెట్టారు. రాజమౌళి వెంటనే సీట్‌లో నుంచి పక్కకు వెళ్లిపోయారు.

రామ్‌చరణ్, తారక్ స్టార్ హీరోలు అయినప్పటికీ వ్యక్తిగతంగా వారిద్దరూ మంచి స్నేహితులని రాజమౌళి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన సెట్‌లో జరిగిన సరదా అల్లర్లను పంచుకున్నారు. హీరోలిద్దరూ సెట్‌లో ఎలా ఉంటారో రాజమౌళి సరదాగా చెబుతున్న సమయంలో పక్క కుర్చీలో కూర్చున్న తారక్ ఆయనకు చక్కిలిగింత పెట్టారు. రాజమౌళి వెంటనే సీట్‌లో నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఆయన మాట్లాడుతూ ‘‘చరణ్, తారక్‌తో షూటింగ్ చేయడం ఎంత పెద్ద సమస్య అంటే... సుమారు 300 రోజులు షెడ్యూల్ వేసుంటే అందులో వీరిద్దరి వల్ల 25 రోజులు వృథా అయ్యాయి’’ అని చెబుతున్న రాజమౌళిని పక్కనే ఉన్న తారక్ సరదాగా గిల్లారు. ఉలిక్కి పడి లేచిన రాజమౌళి అక్కడి నుంచి పక్కకు వెళ్లి మాట్లాడారు. ‘‘ఇద్దరికీ 30 ఏళ్లు పైన ఉంటాయి. పెళ్లిళ్లు అయ్యాయి. కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ సెట్‌లో మాత్రం ‘జక్కన్న చరణ్ నన్ను గిల్ల్లుతున్నాడు’’ అని తారక్ వచ్చి నాకు ఫిర్యాదు చేస్తాడు. చరణ్ ఏమో అమాయకంగా చూస్తూ.. ‘‘నాకు తెలీదు. నేను డైలాగ్ లైన్స్ చూసుకుంటున్నా’’ అంటాడు. సుమారు 15 –20 నిమిషాలు వీళ్లు ఇలాగే సరదాగా ఆట పట్టించుకునేవారు. వీళ్లిద్దర్ని నేను ఎప్పుడు ఆపాలి’’ అని చెప్పడంతో మధ్యలో తారక్ స్పందిస్తూ.. ‘‘అక్కడ జరిగిన దాడిని మీరు చూడలేదా? పెదరాయుడిలా అక్కడ కూర్చొని మీరేం చేశారు? నవ్వడం తప్ప. మీరేమైనా ఖండించారా? అనడంతో వెంటనే చరణ్ అందుకొని.. ‘‘ఎవరు దాడి చేశారు? అది చెప్పండి’ అంటూ రాజమౌళికి సపోర్ట్‌గా మాట్లాడారు చరణ్. సరదాగా సాగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.