రాజ‌మౌళి సాహసం చేయ‌బోతున్నాడా?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి పేరు తెలియ‌ని వారు ఇప్పుడు ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో ఉండ‌రనే చెప్పాలి. ‘బాహుబ‌లి’తో తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన ఈ స్టార్ డైరెక్ట‌ర్ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్‌’తో మ‌రో సెన్సేష‌న్‌కు సిద్ధ‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ జూలైలో మొద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వినిపిస్తోన్న నేప‌థ్యంలో.. ఈ సినిమాకు సంబంధించి జ‌క్క‌న్న మ‌రో డేరింగ్ డిసిష‌న్ తీసుకోబోతున్నాడ‌ట‌. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఎనిమిది నిమిషాల సాంగ్‌ను చిత్రీక‌రించాల‌ని ఈ స్టార్ డైరెక్ట‌ర్ ప్లాన్ చేశాడ‌ట‌. ఈ సాంగ్‌లో చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌లు క‌నిపిస్తారు. సాంగ్ చిత్రీక‌ర‌ణ‌లో వి.ఎఫ్‌.ఎక్స్‌లో కీల‌క పాత్ర‌ను పోషించనుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్ ప్ర‌కారం సినిమాల్లో పాట‌ల‌కు క్ర‌మంగా ప్రాధాన్య‌త త‌గ్గుతున్నాయి. ఇలాంటి సంద‌ర్భంలో ‘ఆర్ఆర్ఆర్‌’ కోసం ఇంత పెద్ద పాట‌ను చిత్రీక‌రించ‌డం నిజంగా జ‌క్క‌న్న సాహ‌స‌మేన‌ని కూడా టాక్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 

ఆంధ్ర మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ పీరియాడిక‌ల్ ఫిక్ష‌నల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’లో స‌ముద్ర‌ఖని, ఆలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ, ఒలివియా మోరిస్ వంటి స్టార్స్ న‌టిస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ మూవీని అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఈ సినిమా రిలీజ్ వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు మ‌రి. ఈ వార్త‌ల‌పై జ‌క్క‌న్న అండ్ టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.