‘RRR’ వాయిదాతో మహేష్ సినిమా వర్క్‌కి సిద్ధమవుతోన్న తండ్రీకొడుకులు

ABN , First Publish Date - 2022-01-16T03:46:07+05:30 IST

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర విడుదల వాయిదా పడటంతో.. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తమ తదుపరి చిత్ర వర్క్‌పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి..

‘RRR’ వాయిదాతో మహేష్ సినిమా వర్క్‌కి సిద్ధమవుతోన్న తండ్రీకొడుకులు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర విడుదల వాయిదా పడటంతో.. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తమ తదుపరి చిత్ర వర్క్‌పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విఎఫ్‌ఎక్స్, కలర్ కరెక్షన్ వంటి అన్ని పనులు పూర్తవడంతో పాటు సెన్సార్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మెరుగుపడి, అన్ని చోట్ల థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడు మాత్రమే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. అది ఎప్పుడు? అనేది ఇప్పుడప్పుడే తేలే విషయం కాదు కాబట్టి.. రాజమౌళి తన తండ్రితో కలిసి తదుపరి సూపర్ మహేష్ బాబుతో చేయబోయే చిత్రం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినవస్తున్నాయి.


మహేష్ బాబుతో ఎటువంటి చిత్రమైతే బాగుంటుందనే విషయంపై ఇప్పటికే వీరిరువురు చర్చలు సాగిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఇండియానా జోన్స్ తరహాలో అడవి నేపథ్యంలో అడ్వంచర్ చిత్రం అయితే వారి మదిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇండియానా జోన్స్ కథానాయకుడి తరహా పాత్రకి మహేష్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని వారి భావిస్తున్నారట. ఇదే కాకుండా ఇంకొన్ని ఆలోచనలు కూడా వారు చేస్తున్నట్లుగా సమాచారం. అన్నీ కుదిరితే ఈ సంవత్సరం పూర్తయ్యే లోపు ఈ చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేయాలని, వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో స్ర్కీన్‌ప్లే వర్క్ పూర్తి చేసి.. ద్వితీయార్థంలో ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాని మొదలెట్టాలనే ఆలోచనలో రాజమౌళి, విజయేంద్రప్రసాద్ ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. 

Updated Date - 2022-01-16T03:46:07+05:30 IST