'రాజా విక్రమార్క' ట్రైలర్: దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు

ABN , First Publish Date - 2021-11-01T23:21:59+05:30 IST

’’విక్రమ్‌.. ఎన్‌ఐఏ ఏజెంట్‌. కృష్ణ సినిమాలు, టామ్‌క్రూజ్‌ సినిమాలు చూసి ఎన్‌ఐఏలో చేరతాడు. కొన్నాళ్లకి తన సరదా తీరిపోతుంది. మరి అతను ఆ జాబ్‌లో కొనసాగాడా? వదిలేశాడా? అసలు విక్రమ్‌ కథేంటి? తెలియాలంటే ‘రాజా విక్రమార్క’ సినిమా చూడాల్సిందే’’ అంటున్నారు దర్శకుడు శ్రీ సారిపల్లి. కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రమిది.

'రాజా విక్రమార్క' ట్రైలర్: దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు

’’విక్రమ్‌.. ఎన్‌ఐఏ ఏజెంట్‌. కృష్ణ సినిమాలు, టామ్‌క్రూజ్‌ సినిమాలు చూసి ఎన్‌ఐఏలో చేరతాడు. కొన్నాళ్లకి తన సరదా తీరిపోతుంది. మరి అతను ఆ జాబ్‌లో కొనసాగాడా? వదిలేశాడా? అసలు విక్రమ్‌ కథేంటి? తెలియాలంటే ‘రాజా విక్రమార్క’ సినిమా చూడాల్సిందే’’ అంటున్నారు దర్శకుడు శ్రీ సారిపల్లి. కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌గా  నటిస్తున్న చిత్రమిది. తాన్యా రామచంద్రన్‌ కథానాయిక. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం నాని ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్తికేయ. తనికెళ్ల భరణి కామెడీతో మొదలైన ట్రైలర్‌ ఆ తర్వాత ట్విస్ట్‌లతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘వీడిది బలుపు కాదు దూల’ అని తనికెళ్ల భరణి, దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేశావ్‌’’ అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్‌లు అలరిస్తున్నాయి. 88 రామారెడ్డి నిర్మాత. టి.ఆదిరెడ్డి సమర్పకుడు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ విహారి సంగితం అందిస్తున్నారు.




Updated Date - 2021-11-01T23:21:59+05:30 IST