శ్రీవిష్ణు సినిమా నుంచి సాంగ్ వచ్చెన్

ABN , First Publish Date - 2021-07-29T02:19:40+05:30 IST

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ బ్యానర్లపై హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన వన్నీ సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా

శ్రీవిష్ణు సినిమా నుంచి సాంగ్ వచ్చెన్

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ బ్యానర్లపై హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన వన్నీ సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రాజ రాజు వచ్చే లోకాలు మెచ్చే’ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘దొరలని మీకు మీరు దొరులుతు తిరిగారు.. చొరబడి చెడిపోతే చతికిల పడతారు.. రాజ రాజు వచ్చే లోకాలు మెచ్చే’ అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ సంగీతం అందించగా.. హసిత్ గోలి సాహిత్యం అందించారు. మోహన భోగరాజు ఆలపించారు. ఈ పాట సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. హసిత్‌ గోలి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన మేఘా ఆకాష్ నటిస్తుండగా సునైన, తనికెళ్ళభరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌ మొదలగువారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. టీవీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రానికి నిర్మాతలు.



Updated Date - 2021-07-29T02:19:40+05:30 IST