రాజ్‌ తరుణ్‌, శివాని రాజశేఖర్ కాంబినేషన్‌లో ‘అహ నా పెళ్ళంట’

ABN , First Publish Date - 2022-04-05T00:33:18+05:30 IST

ఎన్నో ఏళ్లుగా పెళ్ళికోసం ఎదురు చూసి పెళ్లి పీటలెక్కిన వ్యక్తికి.. తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు ఆమె బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయిందని తెలిసి.. వారిద్దరిపై ఆ పెళ్లి కొడుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథతో..

రాజ్‌ తరుణ్‌, శివాని రాజశేఖర్ కాంబినేషన్‌లో ‘అహ నా పెళ్ళంట’

రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా ‘అహ నా పెళ్ళంట’ టైటిల్‌తో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్‌ పూజా కార్యక్రమాలు రాజమండ్రిలోని గరిమొళ్ల  సత్యనారాయణ ట్రైనింగ్‌ కాలేజ్‌లో ఆదివారం ఉదయం జరిగాయి. జీ5, తమడ మీడియా సంయుక్త భాగస్వామ్యంలో.. ‘ఏబీసీడీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో రాహుల్‌ తమడ, సాయిదీప్‌రెడ్డి బుర్ర.. ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెళ్ళికోసం ఎదురు చూసి పెళ్లి పీటలెక్కిన వ్యక్తికి.. తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు ఆమె బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయిందని తెలిసి.. వారిద్దరిపై ఆ పెళ్లి కొడుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథతో.. కామెడీ రొమాన్స్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లుగా దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు.


ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పెళ్లి రోజున తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పెళ్లి కూతురు లేచిపోతుంది. చేతిలో మంగళ సూత్రం పట్టుకుని ఆమె కోసం మండపంలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి... తన జీవితంలో ముఖ్యమైన రోజున అలా జరుగుతుందని ఊహించని ఆ పెళ్లి కొడుకు, అందుకు కారణమైన అమ్మాయి - అబ్బాయిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనేదే ఈ వెబ్ సిరీస్. జీ5 వంటి పెద్ద సంస్థలో ఈ వెబ్ సిరీస్ చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు నా ధన్యవాదాలు అని తెలిపారు.


జీ5 హెడ్స్‌, తమడ మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ వెబ్‌ సిరీస్‌ రాజమండ్రి, పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకుంటుంది. రాజ్‌తరుణ్‌ తొలిసారిగా వెబ్‌సిరీస్‌లో నటించడం వెబ్‌సిరీస్‌లకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం. ఈ మధ్య కాలంలో అన్ని భాషలలోని హీరోలు సైతం ఈ వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈ జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్.. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేదిగా ఉంటుంది. కామెడీ డ్రామా, రొమాన్స్‌లతో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ 30 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌ ప్రసారం అవుతాయని అన్నారు.



Updated Date - 2022-04-05T00:33:18+05:30 IST