మాస్ మహారాజాతో రాజ్ తరుణ్..?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో 'ఖిలాడి' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 'రామారావు ఆన్‌డ్యూటీ', 'ధమాకా' చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రవితేజ, నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో కూడా ఓ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఇందులో ఓ కీలక పాత్ర ఉండగా.. ఆ పాత్రను యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ యంగ్ హీరోకు మాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజే ఉంది. లవర్ బాయ్‌గా సినిమాలు చేస్తున్నా కూడా అన్నీ వర్గాల ప్రేక్షకుల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే మాస్ మహారాజా సినిమాలో ఈ కుర్ర హీరోకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ త్వరలో రానున్నట్టు సమాచారం.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.