'అనుభవించు రాజా'తో రెడీ అవుతున్న రాజ్ తరుణ్

ABN , First Publish Date - 2021-08-17T15:49:25+05:30 IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం 'అనుభవించు రాజా'. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తాజా సమాచారం.

'అనుభవించు రాజా'తో రెడీ అవుతున్న రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం 'అనుభవించు రాజా'. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తాజా సమాచారం. త్వరలోనే రిలీజ్‌ కూడా ప్రకటించనున్నారట. ఇందులో రాజ్ తరుణ్‌కి జంటగా కాషిశ్‌ ఖాన్ నటిస్తుంది. 'ఉయ్యాలా జంపాలా'తో హీరోగా మారిన రా తరుజ్‌ణ్ 'కుమారి 21 ఎఫ్‌'తో క్రేజీ స్టార్‌గా పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ, భారీ హిట్స్ అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇటీవలే 'ఒరేయ్ బుజ్జిగా', 'పవర్ ప్లే' చిత్రాలతో వచ్చిన ఈ యంగ్ హీరో, వరుసగా సినిమాలు కమిటవుతున్నాడు.. చూడాలి మరి 'అనుభవించు రాజా'తో మంచి హిట్ అందుకొని ఫాంలోకి వస్తాడేమో.

Updated Date - 2021-08-17T15:49:25+05:30 IST