టైమ్ ట్రావెల్ కథతో రాహుల్ సాంకృత్యన్ ?

ఇటీవల నేచురల్ స్టార్ నానీతో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు రాహుల్ సాంకృత్యన్. పునర్జన్మ కథాంశంతో బెంగాల్ వాతావరణాన్ని అత్యంత సహజంగా చిత్రీకరించి ప్రేక్షకుల్ని అబ్బుర పరిచాడు.  రాహుల్‌తో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాహుల్ ఒక టైమ్ ట్రావెల్ కథ రాసుకున్నాడట. ఇది ‘ఆదిత్య 369’ చిత్రానికి మోడ్రన్ వెర్షన్‌లా అనిపిస్తుందట. 


హీరో భూత, భవిష్యత్ కాలాలకు ఎలా వెళ్ళాడు? అక్కడేం చేశాడు అన్నది ఈ సినిమా కథాంశమని తెలుస్తోంది. మైత్రీలో చాలా మంది దర్శకులు అడ్వాన్స్ లు తీసుకున్నారు. ప్రస్తుతం వారంతా కథలు రాయడంలో బిజీగా ఉన్నారు. అయితే వారికి హీరోలే దొరకడం లేదు. మరి  టైమ్ ట్రావెల్ కథకోసం రాహుల్ సాంకృత్యన్ కు ఏ హీరో దొరుకుతాడు? అన్నది ఆసక్తిగా మారింది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.