Raghu kunche: సెలబ్రిటీ అనుకోకురా.. ఇక్కడేది పర్మినెంట్‌ కాదురా!

ABN , First Publish Date - 2022-05-17T16:03:31+05:30 IST

ఎందుకే రవణమ్మ(బంపర్‌ ఆఫర్‌) సుబ్బ లచ్చిమి మాటాడే (దేవుడు చేసిన మనుషులు) రాయే రాయే సలోని(మర్యాద రామన్న) గోలపెట్టే..(దేశముదురు) తరత్తా ఎత్తుకుపోతా (కృష్ణ) నక్కిలీసు గొలుసు(పలాస) ఈ పాటలు వింటే గుర్తొచ్చే పేరు రఘు కుంచె.

Raghu kunche: సెలబ్రిటీ అనుకోకురా.. ఇక్కడేది పర్మినెంట్‌ కాదురా!

ఎందుకే రవణమ్మ(బంపర్‌ ఆఫర్‌)

సుబ్బ లచ్చిమి మాటాడే (దేవుడు చేసిన మనుషులు)

రాయే రాయే సలోని(మర్యాద రామన్న)

గోలపెట్టే..(దేశముదురు)

తరత్తా ఎత్తుకుపోతా (కృష్ణ)

నక్కిలీసు గొలుసు(పలాస) ఈ పాటలు వింటే గుర్తొచ్చే పేరు రఘు కుంచె. 

యాంకర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, నటుడు ఇలా ఆయనలో చాలా కోణాలన్నాయి. రఘు(Raghu kunche) పాడిన, సంగీత దర్శకత్వం వహించిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మధ్యకాలంలో రఘు కుంచె నుంచి వచ్చిన ఫోక్‌ సాంగ్‌ ‘నక్కిలీసు గొలుసు’ ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! ఆరు నంది అవార్డులు అందుకున్న రఘు ఇప్పుడు తనలో కొత్తకోణాన్ని బయటకు తీశారు. తాజాగా ఆయన ‘ఐ యామ్‌ సెలబ్రిటీ’ (i am celebrity)అనే వీడియో  చేశారు. ‘సెలబ్రిటీ అనుకోకురా.. నీకు నువ్వే సెలబ్రిటీ అనుకోకురా’ పాటతో ఆయనలోని గేయ రచయితను కూడా బయటకు తీసుకొచ్చారు. ఈ పాటను ఆయనే రాసి, పాడి సంగీతం అందించారు. అంతే కాదు స్టెప్పులు కూడా వేసి అలరించారు. కాన్సెప్ట్‌ నుంచి డైరెక్షన్‌ వరకూ అన్ని బాధ్యలు ఆయనవే! ప్రస్తుతం ఈ పాట ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సోషల్‌ మీడియాలో మంచి చెడ్డలతోపాటు ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టేలా ఉన్న సాగుతుందీ పాట. 


‘నీకు నువ్వే సెలబ్రిటీ అనుకోకు.. ఒక్క రాత్రిలో వొచ్చే స్టారుడమ్‌ మూడునాళ్ళ ముచ్చటే.. ఇక్కడేది పర్మినెంట్‌ కాదు’ అంటూ రియాలిటీకి దగ్గరగా ఆ పాట రాశారు. పెరుగుతున్న సోషల్‌ మీడియాలోని మంచి చెడ్డలను, ప్రస్తుత పరిస్థితులను పాట రూపంలో వినోదాత్మకంగా చెప్పారు. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మధ్యకాలంలో మట్టిలో మాణిక్యాలు లాంటి పల్లె గాయనీగాయకులను ఎంతోమందిని సంగీత లోకానికి పరిచయం చేశారు రఘుకుంచె! 



‘‘ప్రతి మనిషి సొసైటీలో గుర్తింపు రావాలని కోరుకుంటాడు. అయితే అది కొందరికే వస్తుంది. ఏ రంగంలోనైనా కష్టపడి జనాలను మెప్పించగలిగితే వాళ్లకి సెలబ్రిటీ హోదా వస్తుంది. వచ్చిన తర్వాత దానిని బ్యాలెన్స్‌ చేయడం చాలా కష్టం. పెరుగుతున్న సోషల్‌ మీడియా వల్ల సెలబ్రిటీ ఏం చేసినా క్షణాల్లో అది వైరల్‌గా మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సెలబ్రిటీల లైఫ్‌ కత్తిమీద సాములాగా తయారైంది. వాళ్లకు సంబందించి ఏ విషయమైనా పెద్ద న్యూస్‌ అవుతుంది. మీమ్‌, ట్రోల్‌, ఆ తర్వాత యూట్యూబ్‌లో థంబ్‌ నైల్‌ అవుతుంది. వీటి ఆధారంగా ఈ పాట చేశాను. ఐ యామ్‌ ఏ సెలబ్రిటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాను. ఈ పాట ఎవరినీ కించపరచడానికో, తక్కువ చేసి మాట్లాడటానికో చేసింది కాదు. కాస్త వినోదం కోసం అంతే. ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమించమని కోరుకుంటున్నాను’’ అని రఘుకుంచె పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-17T16:03:31+05:30 IST