‘Rudhrudu’గా రాఘవ లారెన్స్.. ఫస్ట్ లుక్ అదిరింది

Twitter IconWatsapp IconFacebook Icon
Rudhruduగా రాఘవ లారెన్స్.. ఫస్ట్ లుక్ అదిరింది

Rudhrudu: నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా.. కతిరేసన్ (Kathiresan) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రానికి ‘రుద్రుడు’ (Rudhrudu) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కతిరేశన్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి చూస్తుంటే ఈ సినిమాలో యాక్షన్‌ హైలైట్‌గా వుండబోతుందనేది అర్థమవుతోంది. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటెడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ ఈవిల్ లుక్‌లో కనిపించి.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. 


రాఘవ లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్ (Sarath Kumar) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కాంచన’ (Kanchana) చిత్రం ఎటువంటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. మళ్లీ లారెన్స్, శరత్ కుమార్ కాంబినేషన్ అనగానే ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. కాగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2022 క్రిస్మస్‌కు థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.