భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రాధికా ఆప్టే (Radhika Apte). ఏ పాత్రను అయినా అలవోకగా పోషిస్తుంటుంది. కథ నచ్చితే ఏ రోల్ అయినా ఒకే చేస్తుంది. ‘పార్చ్డ్’, ‘బజార్’, ‘రక్తచరిత్ర’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. లండన్‌కు చెందిన బెనెడిక్ట్ టేలర్ (Benedict Taylor)ను 2012లో వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం కూడా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకు భయంకరమైన అనుభవం ఎదురయిందని రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో గతంలో చెప్పుకొచ్చింది.
తెలుగు సినిమా షూటింగ్‌కు మొదటి రోజు రాగానే తనకు ఘోరమైన అనుభవం ఎదురయిందని రాధికా ఆప్టే 2018లో ఓ చాట్ షోలో చెప్పింది. ఓ టాలీవుడ్ టాప్ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తెలిపింది. ‘‘తెలుగు సినిమా మొదటి రోజు నేను అనారోగ్యంగా ఉన్న సీన్‌ను చిత్రీకరించాలనుకున్నారు. బెడ్ మీద పడుకునే సీన్‌ను షూట్ చేయాలనుకున్నారు. షూటింగ్ సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. మేం రిహార్సల్ చేస్తున్నాం. అప్పుడు ఆ హీరో నా పాదాలను గిల్లాడు. అతడు పెద్ద నటుడు, చాలా పలుకుబడి ఉన్నవాడని నాకు ముందే చెప్పారు. అయినప్పటికీ నాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అందరి ముందు అరిచాను. కోపంతో నాతో ఎప్పుడు ఇలా ప్రవర్తించకండి అని చెప్పాను. నేను అలా చేయడంతో అతడు షాక్‌కు గురయ్యాడు’’ అని రాధికా ఆప్టే చెప్పింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రాధికా ఆప్టే చివరగా ‘ఫోరెన్సిక్’ (Forensic) లో కనిపించింది. ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలోనే విడుదలైంది. ప్రస్తుతం ఆమె ‘విక్రమ్ వేద’ లో నటిస్తుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా నటిస్తున్నారు. సైఫ్ భార్య పాత్రను ఆమె పోషిస్తుంది.