సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ విడుదల పక్కా
ABN , First Publish Date - 2022-01-03T18:57:12+05:30 IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. హస్త సాముద్రిక నిపుణుడిగా ప్రభాస్ నటిస్తుండగా.. అతడి గురువు పరమహంసగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకూ విడుదలైన రాధేశ్యామ్ చిత్రం టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. హస్త సాముద్రిక నిపుణుడిగా ప్రభాస్ నటిస్తుండగా.. అతడి గురువు పరమహంసగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకూ విడుదలైన రాధేశ్యామ్ చిత్రం టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదలవుతోన్న ఈ సినిమా పక్కాగా సంక్రాంతి కానుకగా.. ముందుగా నిర్ణయించిన జనవరి 14నే విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
ఇతర రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ విడుదల సందిగ్ధంలో పడింది. అందుకే సినిమాను సంక్రాంతి రేస్ నుంచి తప్పించారు మేకర్స్. దాంతో చిన్న చిత్రాలు సంక్రాంతి బరిలోకి వచ్చాయి. ఇప్పటికే పలు చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలవుతున్నట్టు అనౌన్స్ అయ్యాయి. ‘రాధేశ్యామ్’ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ లాగానే రేస్ లోంచి తప్పుకుంటుందని సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే ‘రాధేశ్యామ్ రిలీజ్ ప్లాన్స్ లో ఇప్పటి వరకూ ఎలాంటి మార్పులు లేవు. జనవరి 14నే సినిమా విడుదలవుతుంది. రూమర్స్ నమ్మొద్దు’ అని నిర్మాతలు ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.