Radhe shyam: వస్తుందా ..రాదా ఆరోజు డిసైడవుతుందా..?

ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో రావాల్సిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాంతో అందరూ 'రాధే శ్యామ్ సినిమా పరిస్థితేంటి..ఇదీ పాన్ ఇండియన్ సినిమానే కదా. మరి ప్రకటించిన తేదీకి విడుదల చేస్తారా లేక 'ఆర్ఆ్ఆర్' చిత్రం మాదిరిగా పోస్ట్‌పోన్ చేస్తారా..! అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకైతే 'రాధే శ్యామ్' చిత్రం ప్రకటించిన జనవరి 14నే రిలీజ్ అని చెబుతున్నారు.

కానీ, ఎక్కడో కొన్ని సందేహాలు ఉన్నాయట. దీనిపై జనవరి 5న ఓ క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. అప్పటివరకు కేసులు నిలకడగా ఉంటే రిలీజ్ చేసేస్తారు. లేదంటే 'ఆర్ఆర్ఆర్' బాటలోనే 'రాధే శ్యామ్' కూడా. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్, టీ సిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.