‘రాధేశ్యామ్’ లేటెస్ట్ అప్‌డేట్‌!

ABN , First Publish Date - 2021-07-17T20:15:52+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తోన్న పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి ‘రాధేశ్యామ్’. కొన్ని సన్నివేశాలు, ఓ సాంగ్ మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌య్యింది. పూర్తి చేద్దామ‌నుకునేలోపు..

‘రాధేశ్యామ్’ లేటెస్ట్ అప్‌డేట్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తోన్న పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి ‘రాధేశ్యామ్’. కొన్ని సన్నివేశాలు, ఓ సాంగ్ మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌య్యింది. పూర్తి చేద్దామ‌నుకునేలోపు కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా షూటింగ్‌ను ఆపాల్సి వ‌చ్చింది. ఇప్పుడు షూటింగ్స్ క్ర‌మంగా మొద‌ల‌వుతున్న క్ర‌మంలో ‘రాధేశ్యామ్’ మేక‌ర్స్ షూటింగ్ జూలై 22 నుంచి స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట. ప్ర‌భాస్‌, పూజాహెగ్డేల‌పై స‌న్నివేశాలు, సాంగ్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తే చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మ‌రోవైపు  ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ పూర్త‌యిన వ‌ర‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. పెండింగ్ షూటింగ్ పూర్తి కాగానే.. రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను చేయ‌నుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద నిర్మాత‌లు. 

Updated Date - 2021-07-17T20:15:52+05:30 IST