'రాధే శ్యామ్': ప్రభాస్ న్యూ లుక్ వైరల్

ABN , First Publish Date - 2021-10-22T16:11:04+05:30 IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 23న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. డార్లింగ్ కామన్ డీపీతో నెట్టింట చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

'రాధే శ్యామ్': ప్రభాస్ న్యూ లుక్ వైరల్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 23న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. డార్లింగ్ కామన్ డీపీతో నెట్టింట చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఒకటి 'రాధే శ్యామ్'. ఈ మూవీలో విక్రమ్ ఆదిత్యగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే కొన్ని పోస్టర్స్ వచ్చి విపరీతంగా ఆకట్టుకోగా, తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మరో కొత్త లుక్‌ను వదిలాడు. ఈ లుక్‌లో ప్రభాస్ ఎంత స్టైలిష్‌గా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పడం కంటే చూడటమే బెటర్. ఈ లేటెస్ట్ పోస్టర్‌పై మీరు ఓ లుక్కేయండి. 



Updated Date - 2021-10-22T16:11:04+05:30 IST