‘రాధే’ బాటలో ‘రాధేశ్యామ్’ విడుదల ?

ABN , First Publish Date - 2022-01-06T16:46:07+05:30 IST

దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. సంక్రాంతి బరిలోకి దిగిన పాన్ ఇండియా సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు దీని కారణంగానే విడుదలను వాయిదా వేసుకున్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్, వలిమై’ లాంటి సినిమాలు పక్కకి తప్పుకోవడంతో ఆ స్లాట్ లోకి మీడియమ్ రేంజ్ మూవీస్ విడుదల కాబోతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ సంక్రాంతి విడుదల విషయంలో పట్టుదలగానే ఉంది ‘రాధేశ్యామ్’ మూవీ. అయితే తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో థియేటర్స్ ను మూతవేయడం, మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు దిశగా అడుగు వేస్తుండడంతో ‘రాధేశ్యామ్’ చిత్ర బృందం వెనకడుగు వేయకతప్పలేదు.

‘రాధే’ బాటలో ‘రాధేశ్యామ్’ విడుదల ?

దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. సంక్రాంతి బరిలోకి దిగిన పాన్ ఇండియా సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు దీని కారణంగానే విడుదలను వాయిదా వేసుకున్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్, వలిమై’ లాంటి సినిమాలు పక్కకి తప్పుకోవడంతో ఆ స్లాట్ లోకి మీడియమ్ రేంజ్ మూవీస్ విడుదల కాబోతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ సంక్రాంతి విడుదల విషయంలో పట్టుదలగానే ఉంది ‘రాధేశ్యామ్’ మూవీ. అయితే తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో థియేటర్స్ ను మూతవేయడం, మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు దిశగా అడుగు వేస్తుండడంతో ‘రాధేశ్యామ్’ చిత్ర బృందం వెనకడుగు వేయకతప్పలేదు. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో, ఎప్పటికి పరిస్థితులు చక్కబడతాయో తెలియని అయోమయ స్థితిలో ఉంది ‘రాధేశ్యామ్’ టీమ్. 


అయితే ఈ సినిమాను పేఫర్ వ్యూ పద్ధతిలో విడుదల చేసే ఆలోచనలో ‘రాధేశ్యామ్’ మేకర్స్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ సమ్మర్ సీజన్ లో విడుదలయ్యే అవకాశాలుండడం, వేరే పెద్ద చిత్రాలు కూడా విడుదలయ్యే ఛాన్సెస్ ఉండడంతో.. ఇప్పటికే బాగా లేటయిన ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని అంతవరుకూ హోల్డ్ చేయలేమని చిత్ర బృందం భావిస్తోందట. ఇప్పటికే ఈ సినిమాకి ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. దాదాపు రూ. 300కోట్లకు పైగానే ఓటీటీ ఆఫర్స్ వస్తున్నాయట. ప్రభాస్ కున్న క్రేజ్ దృష్ట్యా అంత రేటు గిట్టుబాటు అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రం మాదిరిగా ‘రాధేశ్యామ్’ మూవీని పేఫర్ వ్యూ పద్ధతిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూ, ఇప్పుడిప్పుడే థియేటర్స్ తెరుచుకొనే పరిస్థితులు లేకపోతే ‘రాధేశ్యామ్’ నిర్మాతలు పేఫర్ వ్యూ పద్ధతికి టెమ్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-01-06T16:46:07+05:30 IST