'రాధే శ్యామ్': ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే కొత్త పోస్టర్..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్'. తాజాగా ఈ మూవీ నుంచి పూజా హెగ్డే కొత్త పోస్టర్ రిలీజైంది. రాధా కృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ - ప్రమోద్ - ప్రశీద కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రభాస్, పూజా హెగ్డేల పోస్టర్స్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా మీద బాగా అంచనాలను పెంచాయి. ఈ క్రమంలో నేడు  (అక్టోబర్ 13) హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా, ఇందులో ప్రేరణగా నటిస్తున్న ఆమె లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ పోస్టర్‌లో పూజా వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఒకవైపు తిరిగి స్మైల్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులనే కాక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా 'రాధే శ్యామ్' 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కాబోతోంది.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.