Radhe shyam: ట్రైలర్‌కు డేట్ ఫిక్స్..?

ABN , First Publish Date - 2021-12-08T14:06:22+05:30 IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ 'రాధే శ్యామ్'. ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రాబోతోందని..

Radhe shyam: ట్రైలర్‌కు డేట్ ఫిక్స్..?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ 'రాధే శ్యామ్'. ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రాబోతోందని.. అందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం అన్నీ భాషలలో సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్‌తో భారీ అంచనాలు నెలకొన్న 'రాధే శ్యామ్' నుంచి రాబోతున్న ట్రైలర్ మరో లేవల్‌లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ కటింగ్ పూర్తైందట. డిసెంబర్ 17న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ - టి సిరీస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.  

Updated Date - 2021-12-08T14:06:22+05:30 IST