‘చాలా అందం’గా ఉండటంతో... ‘చాలా అవకాశాలు’ కోల్పోవాల్సి వచ్చిందట!

Twitter IconWatsapp IconFacebook Icon
చాలా అందంగా ఉండటంతో... చాలా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందట!

పేరుకు తగ్గట్టుగానే రాశి పోసిన అందాల బొమ్మలా ఉంటుంది... రాశీ ఖన్నా. కానీ, ఆమెకు తన అందమే మొదట్లో బంధమైందట!  చాలా మంది అమ్మాయిలు గ్లామర్ ప్రపంచంలో అందం తక్కువై వెనకబడిపోతుంటారు. కానీ, బాలీవుడ్‌లో ఓ సినిమా చేసి దక్షిణాదిలో వాలిపోయిన రాశీకి మాత్రం రివర్స్ ఎఫెక్ట్ అనుభవంలోకి వచ్చిందట. సౌత్ సినిమాల్లో నటించటం మొదలు పెట్టాక జనం ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్’’ అనేవారట! అది సంతోషకరమే అయినా... చివరకు ‘ఆ అందమే’ అనేక అవకాశాలు చేజారటానికి కారణమైందట! 


సినీ పరిశ్రమలో ఓ మూఢ నమ్మకం ఉందంటోంది చబ్బీ బ్యూటీ రాశీ ఖన్నా. గ్లామర్ డాల్‌గా చూడ చక్కగా కనిపించే హీరోయిన్స్ గొప్ప యాక్టర్స్ అవ్వలేరని చాలా మంది భావిస్తారట. రాశీ గురించి కూడా తొలి నాళ్లలో అదే ప్రచారం చేశారట. కొందరైతే ఆమెతోనే నేరుగా ‘‘నువ్వు చాలా చక్కగా ఉన్నావ్... నిన్ను అలా చూడలేం’’ అనేవారట! ‘‘నా ఆడిషన్ తీసుకుని... నేను యాక్ట్ చేయగలనో లేదో చూడాలి కదా...’’ అంటోంది రాశీ. అయితే, మెల్లమెల్లగా తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని తన అందంతోనే కాక నటనతోనూ ఆకట్టుకున్న ముంబై బ్యూటీ ఇప్పుడు తిరిగి బాలీవుడ్‌కి వెళ్లింది. ‘మద్రాస్ కేఫ్’ సినిమాతో హిందీ తెరపైనే తన నట జీవితం ప్రారంభించిన గార్జియస్ గాడెస్ 9 ఏళ్ల తరువాత ముంబైలో కొత్త ప్రాజెక్ట్స్ బిజీగా ఉంది. ఇప్పటికే రాశీ ‘రుద్రా’ వెబ్ సిరీస్‌లో అజయ్ దేవగణ్ సరసన నటించింది. నెక్ట్స్ షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి బీ-టౌన్ స్టార్స్‌తో రొమాన్స్ చేయనుంది. చూడాలి మరి మన అందాల రాశికి నటిగా ఇక మీదటైనా చక్కటి గుర్తింపు, అవకాశాలు వస్తాయో లేదో... 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.