లగ్జరీ ఫ్లైట్‌లో రత్తాలు.. పిక్స్ వైరల్

ABN , First Publish Date - 2021-10-23T02:22:09+05:30 IST

సౌత్, నార్త్‌ సినీ ఇండస్ట్రీలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ లక్ష్మీరాయ్‌. ఇప్పుడీ భామ లగ్జరీ విమానంలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఈ భామ రీసెంట్‌గా

లగ్జరీ ఫ్లైట్‌లో రత్తాలు.. పిక్స్ వైరల్

సౌత్, నార్త్‌ సినీ ఇండస్ట్రీలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ లక్ష్మీరాయ్‌ (రాయ్ లక్ష్మీ). ఇప్పుడీ భామ లగ్జరీ విమానంలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఈ భామ రీసెంట్‌గా నటించిన చిత్రాలు ‘మిరుగా’, ‘సిండ్రెల్లా’. ఈ రెండు చిత్రాలు ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అయినప్పటికీ సినిమాల్లో అవకాశాల కోసం సోషల్‌ మీడియా వేదికగా ఎక్స్‌పోజింగ్‌ దంచుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా లక్ష్మీరాయ్‌.. ఒక లగ్జరీ విమానంలో వెళుతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. హిట్టు లేకపోయినా విలాస జీవితానికి ఢోకా లేదు అనేలా ఆమె ఫోజులు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.



Updated Date - 2021-10-23T02:22:09+05:30 IST