Alia Bhatt తండ్రి జీవితం ఆధారంగా వెబ్ సిరీస్... కీలక పాత్రలో Amala Paul...

ABN , First Publish Date - 2022-01-19T02:49:15+05:30 IST

రియా చక్రవర్తి, వరుణ్ మిత్రా జంటగా నటించిన ‘జలేబి’ సినిమా గుర్తుందా? ఆ సినిమా దర్శకుడే పుష్పదీప్ భరద్వాజ్. మొదటి చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకుని కొద్ది రోజుల క్రితమే ‘రంజీష్ హీ సహీ’ అనే వెబ్ సిరీస్‌తో నెటిజన్స్ ముందుకొచ్చాడు. అయితే, తాహిర్ రాజ్ భసిన్, అమృతా పురితో పాటూ మన సౌత్ బ్యూటీ అమలా పాల్ నటించిన ఈ వెబ్ సిరీస్‌ కథకి ప్రేరణ ఎవరో తెలుసా?

Alia Bhatt తండ్రి జీవితం ఆధారంగా వెబ్ సిరీస్... కీలక పాత్రలో Amala Paul...

రియా చక్రవర్తి, వరుణ్ మిత్రా జంటగా నటించిన ‘జలేబి’ సినిమా గుర్తుందా? ఆ సినిమా దర్శకుడే పుష్పదీప్ భరద్వాజ్. మొదటి చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకుని కొద్ది రోజుల క్రితమే ‘రంజీష్ హీ సహీ’ అనే వెబ్ సిరీస్‌తో నెటిజన్స్ ముందుకొచ్చాడు. అయితే, తాహిర్ రాజ్ భసిన్, అమృతా పురితో పాటూ మన సౌత్ బ్యూటీ అమలా పాల్ నటించిన ఈ వెబ్ సిరీస్‌ కథకి ప్రేరణ ఎవరో తెలుసా? ఆలియా భట్ తండ్రి మహేశ్ భట్ అంటున్నాడు డైరెక్టర్!


‘రంజీష్ హీ సహీ’... ఓ దర్శకుడి కథ. ఓ వైపు కట్టుకున్న భార్య, మరో వైపు స్టార్ హీరోయిన్... వీళ్లిద్దరి మధ్యా సదరు దర్శకుడి మానసిక సంఘర్షణే పుష్పదీప్ వెబ్ సిరీస్‌గా తీశాడు. అయితే, దీనికి ప్రేరణ తన మెంటార్ మహేశ్ భట్ ఇచ్చిన సమాచారమేనంటున్నాడు డైరెక్టర్. అప్పట్లో హీరోయిన్ పర్విన్ బాబీతో భట్ ప్రేమ కథ చాలా పాప్యులర్. వారిద్దరి మధ్య జరిగిన కొన్ని నిజ జీవిత సన్నివేశాలే ‘రంజీష్ హీ సహీ‘గా సీరిస్‌గా మారాయట. కాకపోతే, తన ప్రాజెక్ట్ పూర్తిగా భట్ సాబ్ బయోగ్రఫి కాదంటున్నాడు పుష్పదీప్ భరద్వాజ్. కొంత రియల్, కొంత ఫిక్షన్ కలగలిపి షో రూపొందించాడట. చూడాలి మరి, ప్రస్తుతం ‘వూట్’లో స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ సాగా ఆడియన్స్ నుంచీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో.

Updated Date - 2022-01-19T02:49:15+05:30 IST