ధ్రువ సర్జా, రచితా రామ్, హరిప్రియ ప్రధాన పాత్రలు పోషించిన కన్నడ చిత్రం ‘పుష్పరాజ్ ద సోల్జర్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘పుష్పరాజ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు. బొడ్డు అశోక్ నిర్మాత. ఈనెల 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇదో లవ్, యాక్షన్, ఎంటర్టైనర్. అర్జున్ మేనల్లుడు ధ్రువ కథానాయకుడిగా నటించారు. అర్జున్ చిత్రాలు తెలుగులో మంచి విజయాల్ని అందుకొన్నాయి. ఆయన మేనల్లుడినీ ప్రేక్షకులు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది. ‘పుష్ప’ అనే సౌండింగ్లో ఓ మ్యాజిక్ ఉంది. అది ఈ సినిమాతో పునరావృతం అవ్వడం ఖాయం’’ అన్నారు. ఈ చిత్రానికి హరికృష్ణ సంగీతం అందించారు.