Pushpa: హిందీ ట్రైలర్ కోసం వెయిటింగ్..

ABN , First Publish Date - 2021-12-07T13:51:05+05:30 IST

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'పుష్ప'. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ దూసుకెళుతోంది.

Pushpa: హిందీ ట్రైలర్ కోసం వెయిటింగ్..

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'పుష్ప'. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ దూసుకెళుతోంది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు ఈ మూవీ హిందీ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా.. సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ నెల 17న 'పుష్ప ది రైజ్ పార్ట్ 1'ను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడం మలయాళ భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను ఒక్క హిందీ వెర్షన్ తప్ప తెలుగుతో పాటు మిగతా మూడు సౌత్ భాషలలో రిలీజ్ చేశారు. 


ఈ నాలుగు భాషలలోనూ ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. అయితే, హిందీ వెర్షన్ ట్రైలర్ ఎందుకు ఆపారని అందరూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం హిందీ ట్రైలర్‌ను ఇంకాస్త డిఫరెంట్‌గా తయారుచేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే హిందీ వెర్షన్ ట్రైలర్‌ను కూడా చిత్రబృందం వదలబోఉన్నారట. ఇక ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తంశెట్టి మీడియా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  

Updated Date - 2021-12-07T13:51:05+05:30 IST