Pushpa the rise : ట్రైలర్ వచ్చేది అప్పుడే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’. చిత్రీకరణ చివరి దశకి చేరుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, నాలుగు సింగిల్స్ విడుదలయ్యాయి. అవన్నీ రికార్డు వ్యూస్ తెచ్చుకున్నాయి. త్వరలో సమంతపై చిత్రీకరించిన ఐదో సింగిల్ కూడా రాబోతోంది. డిసెంబర్ 17న విడుదల తేదీని లాక్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో ‘పుష్ప’ నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ కూడా రాబోతోంది. సుక్కూ అండ్ టీమ్ ఓ మాసీ ట్రైలర్ ను కట్ చేస్తున్నారట. 


తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప : ది రైజ్’ చిత్రం ట్రైలర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండబోతోందని టాక్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది.  మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్ విలన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ దాక్షాయణి అనే ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న పుష్ప చిత్రాన్ని మైత్రీమూవీస్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.