pushpa: సమంత ఒక స్పెషల్ సాంగ్ 'ఉ అంటావా ఊ అంటావా'..

ABN , First Publish Date - 2021-12-03T13:24:36+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది.

pushpa: సమంత ఒక స్పెషల్ సాంగ్ 'ఉ అంటావా ఊ అంటావా'..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న 'పుష్ప' మూవీలో సమంత స్పెషల్ సాంగ్ 'ఉ అంటావా ఊ అంటావా'..అనే లిరిక్స్‌తో మొదలవుతుందట. ఇది ఇప్పటివరకు దేవీశ్రీ కంపోజ్ చేసిన అన్నీ సాంగ్స్‌కు మించి ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు 4 సాంగ్స్ వచ్చి ట్రెండింగ్‌లో నివలగా, 5వ సాంగ్‌గా సమంత 'ఉ అంటావా ఊ అంటావా'..రాబోతోంది. మరి ఈ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ రాబోతుండగా.. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా 5 భాషలలో 'పుష్ప ది రైజ్ పార్ట్ 1' రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-12-03T13:24:36+05:30 IST