Pushpa: వైరల్ అవుతున్న సమంత బ్యాక్ ఫోజ్ పిక్..

ABN , First Publish Date - 2021-12-01T13:50:21+05:30 IST

సమంత కెరీర్‌లో మొదటిసారి ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన ఆమె పిక్ ఒకటి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా

Pushpa: వైరల్ అవుతున్న సమంత బ్యాక్ ఫోజ్ పిక్..

సమంత కెరీర్‌లో మొదటిసారి ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన ఆమె పిక్ ఒకటి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి భాగం 'పుష్ప ది రైజ్ పార్ట్ 1' 5 భాషలలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 4 సాంగ్స్ వచ్చి భారీ రెస్పాన్‌ను తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో 5వ సాంగ్‌గా సమంత చేస్తున్న స్పెషల్ సాంగ్ రాబోతోంది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ స్పెషల్ సాంగ్‌లోని సమంతకు సంబంధించిన బ్యాక్ ఫోజ్ లుక్ ఒకటి మేకర్స్ వదిలారు. ఈ లుక్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఎప్పుడెప్పుడు ఈ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేయనుందోనని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

Updated Date - 2021-12-01T13:50:21+05:30 IST