‘పుష్ప’ పోస్టర్‌: ఊర మాస్ అంతే..

ABN , First Publish Date - 2021-10-27T03:15:02+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందులో మొదటి భాగమైన ‘పుష్ప: ది రైజ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్

‘పుష్ప’ పోస్టర్‌: ఊర మాస్ అంతే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందులో మొదటి భాగమైన ‘పుష్ప: ది రైజ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి ‘సామి సామి’ అనే సాంగ్ ప్రోమోని చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’ లిరికల్ వీడియోలు ఎంత పెద్ద విజయం సాధించాయో.. ఇప్పుడు విడుదలకాబోతోన్న 3వ సాంగ్ ‘సామి సామి’ ప్రోమో కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.


ఇదిలా ఉంటే, తాజాగా ఈ పాటలోని ఓ స్టిల్ బయటికి వచ్చింది. పక్కా మాస్ అవతారంలో అటు అల్లు అర్జున్.. ఇటు రష్మిక మందన్న కనిపిస్తున్నారు. న్యాచురల్ లుక్స్‌తో ఊర మాస్ లుక్‌లో ఉన్న ఈ పిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్, సమంతల ‘రంగస్థలం’కు ధీటుగా అల్లు అర్జున్, రష్మికల లుక్ ఉందంటూ బన్నీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అక్టోబర్ 28 ఉదయం 11 గంటల 07 నిమిషాలకు ‘సామి సామి’ పూర్తి పాటను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.



Updated Date - 2021-10-27T03:15:02+05:30 IST