అప్పుడే ఓటీటీలోకి ‘పుష్ప ది రైజ్’ ?

అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో విడుదలైన మూడో చిత్రం ‘పుష్ప ది రైజ్’.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా సంచలనాలు నమోదు చేస్తునే ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషలన్నిటిలోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించి.. ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి ఈ సినిమా రూ. 300కోట్ల మార్క్ ను దాటేసింది. రెండో భాగం ‘పుష్ప ది రూల్’ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా రిలీజై సరిగ్గా 17 రోజులైంది. మరో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నదనే వార్తలొస్తున్నాయి. 


జనవరి 7న అమెజాన్ ప్రైమ్ లో ‘పుష్ప ది రైజ్’ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. అయితే ఒక్క తెలుగు వెర్షన్ తప్ప మిగిలిన భాషల్లోనే అమెజాన్ లో విడుదలవుతుందని, తెలుగు వెర్షన్ మాత్రం ‘ఆహా’ లో స్ట్రీమ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే తెలుగు వెర్షన్ ను మినహాయించి మిగిలిన భాషల్లో అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుందా లేక  అన్ని వెర్షన్స్ అందులోనే స్ట్రీమ్ అవుతాయా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాలి. ఏదేమైనా పుష్ప మూవీ అప్పుడే ఓటీటీలో రానుండడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.