Pushpa: ఏం పాటరా సామీ.. రికార్డులు బద్దలవుతున్నాయ్

ABN , First Publish Date - 2021-10-30T03:33:10+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిసోన్న చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత

Pushpa: ఏం పాటరా సామీ.. రికార్డులు బద్దలవుతున్నాయ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిసోన్న చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత బన్నీ-సుక్కుల హ్యాట్రిక్ చిత్రంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘సామీ సామీ’ అనే మాస్ సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ఇప్పుడు రికార్డులను కొల్లగొడుతూ.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. సౌత్ ఇండియాలో 24 గంటల్లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 10.2 మిలియన్ వ్యూస్‌ని ఈ సాంగ్ రాబట్టడమే కాకుండా.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, మౌనిక యాదవ్ ఆలపించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. 

ఈ పాట లిరిక్స్: 

అమ్మీ ఏందమ్మీ అట్టా సూత్తండావ్.. ఏందమ్మీ..

నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లానైపోయినట్టుందిరా సామీ.. నా సామీ..

నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ.. నా సామీ..

నీ ఎనకే ఎనకే అడుగేస్తాంటే.. నీ ఎనకే ఎనకే అడుగేస్తాంటే ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామీ..

పక్కాపక్కాన గూసుంటేనే పరమేశ్వరున్ని ఎక్కినట్టుందిరా సామీ..

నువ్ ఎల్లే దారే సూత్తుంటే ఏరే ఎండినట్టుందిరా సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

పిక్కల పైదాక పంచె నువ్ ఎత్తి కడితే..

పిక్కల పైదాక పంచె నువ్ ఎత్తి కడితే.. నా పంచ ప్రాణాలు పోయేను సామీ..

కార కిల్లి నువ్ కసకస నములుతుంటే నా ఒళ్ళు ఎర్రగ పండెను సామీ..

నీ అరుపులు కేకలు వింటా ఉంటే.. ఏఏఏఏ..

నీ అరుపులు కేకలు వింటా ఉంటే.. పులకరింపులు సామీ..

నువ్ కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామీ..

రెండు గుండీలు విప్పి గుండెలు చూపిత్తే పాల కుండలాగా పొంగిపోతా సామీ.. నా సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

కొత్తసీర కట్టుకుంటే.. ఎట్టవుందో సెప్పకుంటే.. కొన్న విలువ సున్నా అవ్వదా సామీ..

కొప్పులోన పూలు కొడితే.. గప్పున నువ్ పీల్చుకుంటే పూల గుండె రాలిపడదా సామీ..

కొంగే జారేటప్పుడు నువ్వు.. ఆఆఆఆఆ..

నా కొంగే జారేటప్పుడు నువ్వే సూడకుంటే సామీ.. ఆ కొంటెగాలి నన్నే చూసి జాలిపడదా సామీ..

నా అందం చందం నీదవకుంటే సామీ.. నా ఆడపుటకే పీడైపోదా సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

Updated Date - 2021-10-30T03:33:10+05:30 IST