దసరా బరిలో ‘పుష్ప 2’ ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మూడో సినిమాగా వచ్చిన ‘పుష్ప : ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ తన దూకుడు చూపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో నూ, ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వస్తూండడం అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక తదుపరి భాగంగా రాబోయే ‘పుష్ప ది రూల్’ పైనే ఉంది అందరి దృష్టి. ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరిలో మొదలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి రెండో భాగంలో మదర్ సెంటిమెంట్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉందట. దాన్ని నిడివి తగ్గించి.. ఫహద్ ఫాజిల్ కు , బన్నీకి మధ్య వచ్చే సీన్స్ లెంత్ పెంచే ఆలోచనలో ఉందట టీమ్. అలాగే బన్నీ, రష్మికల మధ్య రొమాంటిక్ సీన్స్ ను కూడా పెంచుతున్నారట. 


‘పుష్ప 2’ చిత్రం షూటింగ్ కోసం సుకుమార్ 100రోజుల టార్గెట్ పెట్టుకున్నారట. అంటే దాదాపు మూడు నెలలు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైతే..  మే నెల నాటికి టాకీ పార్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి..  సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనేది సుకుమార్ ఆలోచనగా తెలుస్తోంది. ఫహద్ ఫాజిల్ మలయాళంలో చాలా బిజీ ఆర్టిస్ట్.. ఆయన వీలును బట్టి.. సీన్స్ ప్లాన్ చేయాలి. అలాగే... అల్లు అర్జున్, ఇతర ముఖ్య నటుల వీలు కూడా చూసుకోవాలి. వీరి డేట్స్ ను బట్టే.. పుష్ప2 షెడ్యూల్స్ ప్లానింగ్ ఉంటుందట. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.