Puri musings: బండ్ల గణేశ్‌ స్పీచ్‌కు.. పూరి కౌంటర్‌!

ABN , First Publish Date - 2022-06-27T20:30:36+05:30 IST

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు పూరి జగన్నాథ్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇద్దరిదీ అన్నదమ్ముల అనుబంధం లాంటిది. పూరి దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాల్లో బండ్ల నటించారు. నిర్మాతగా పూరి జగన్‌ దర్శకత్వంలో బండ్ల గణేశ్‌ ‘ఇద్దరమ్మాయిలతో’, ‘టెంపర్‌’ చిత్రాలు నిర్మించారు. సమయం కుదిరిన ప్రతిసారీ పూరిపై తనకున్న అభిమానాన్ని చాటి చెబుతుంటారు బండ్ల గణేశ్‌. అలాంటి ఓ ప్రయత్నమే పూరి ఆకాశ్‌ నటించిన ‘చోర్‌ బజార్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చేశారు.

Puri musings: బండ్ల గణేశ్‌ స్పీచ్‌కు.. పూరి కౌంటర్‌!

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు పూరి జగన్నాథ్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇద్దరిదీ అన్నదమ్ముల అనుబంధం లాంటిది. పూరి దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాల్లో బండ్ల నటించారు. నిర్మాతగా పూరి జగన్‌ దర్శకత్వంలో బండ్ల గణేశ్‌ ‘ఇద్దరమ్మాయిలతో’, ‘టెంపర్‌’ చిత్రాలు నిర్మించారు. సమయం కుదిరిన ప్రతిసారీ పూరిపై తనకున్న అభిమానాన్ని చాటి చెబుతుంటారు బండ్ల గణేశ్‌. అలాంటి ఓ ప్రయత్నమే పూరి ఆకాశ్‌ (Akash puri)నటించిన ‘చోర్‌ బజార్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చేశారు. ఆయన స్పీచ్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వేదికపై పూరి భార్య లావణ్యను పొగిడిన తీరు, కొడుకు సినిమా ఈవెంట్‌కు కూడా రాకుండా ‘ఏం బిజీగా ఉన్నావ్‌ అన్నయ్య’  అంటూ పూరి జగన్నాథ్‌ను నిలదీసిన తీరు వైరల్‌ అవుతోంది. (Bandla ganesh comments on puri jagan)


‘‘పూరి జగన్నాథ్‌ ఎంతోమందిని స్టార్స్‌ని చేశాడు. డైలాగు చెప్పడం, డాన్స్‌ చేయడం రాని వాళ్లకు అన్ని నేర్పించాడు. ఊరంతా కళ్లాపి చల్లుతాడు కానీ.. ఇంటి ముందు మాత్రం ఏం చేయడు. నా బిడ్డకు సంబంధించిన సినిమా ఫంక్షన్‌ ఉంటే నేను లండన్‌లో ఉన్నా ప్రత్యేక విమానంలో వచ్చేవాడిని. కానీ పూరి అన్న కొడుకు ప్రొగ్రాం ఉండి కూడా ఎక్కడో ఉన్నాడు. ఏం బిజీగా ఉన్నాడో నాకు తెలీదు.. కానీ ఇంకోసారి ఇలా చేయకు అన్న.  మనం ఏం చేసినా మన భార్యాబిడ్డల కోసమే! ఎంతోమందిని స్టార్స్‌ చేశావ్‌.. నన్ను స్టార్‌ ప్రొడ్యూసర్‌ చేశావ్‌! నీ కొడుకు దగ్గరికి వచ్చేసరికి ముంబైలో కూర్చేన్నావ్‌? ఇదెక్కడి న్యాయం అన్నా. దీనికి మేం ఒప్పుకోము’ అంటూ వేదికపై ఊగిపోయారు. ‘ఆకాశ్‌ స్టార్‌ అవుతాడు.. అతని కోసం బ్యాంకాక్‌లో కథ రాసుకుని డేట్స్‌ కోసం క్యూలో ఉంటావ్‌. ఆ రోజు తప్పకుండా వస్తుంది.. నీకు డేట్స్‌ ఇవ్వొదని నేనే అడ్డుపడతా’ అంటూ నవ్వులు పూయించారు.  (Puri jaganath)


పేరు చెప్పకుండానే పూరి జగన్నాథ్‌ బండ్లకు కౌంటర్‌ ఇచ్చారు. తన మ్యూజింగ్స్‌ ద్వారా ఓ వాయిస్‌ విడుదల చేశారు.  ‘గుర్తు పెట్టుకోండి. మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమి నేర్చుకోలేం. అందుకే జీవితంలో ఎక్కువ సేపు వింటూ ఉండాలి. ఎవరి విషయంలో అయినా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు.. చీప్‌గా ప్రవర్తించొద్దు. మన వాగుడు మన కెరీర్‌ను, క్రెడిబిలిటీని డిసైడ్‌ చేస్తుంది. ‘నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అనే  సుమతీ శతకం మీరు వినే ఉంటారు. తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. చివరగా ఒక మాట.. నీ లైఫ్‌, నీ డెత్‌.. నీ టంగ్‌ మీద ఆధారపడి ఉంటుంది. అని ఆ వాయిస్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. అయితే ఈ వాయిస్‌లో పేరు చెప్పకపోయినప్పటికీ ఈ కౌంటర్‌ బండ్ల గణేశ్‌ కోసమే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  (Puri counter to Bandla ganesh)


Updated Date - 2022-06-27T20:30:36+05:30 IST