JGM : హీరో పాత్రలో పూరీ ఇజమ్?

ABN , First Publish Date - 2022-08-08T18:34:47+05:30 IST

‘లైగర్’ (Liger) తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కలయికలో ‘జనగణమన’ (JGM) అనే మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ మూవీలో విజయ్ తొలిసారి సైనికుడిగా నటించబోతున్నాడు.

JGM : హీరో పాత్రలో పూరీ ఇజమ్?

‘లైగర్’ (Liger) తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కలయికలో ‘జనగణమన’ (JGM) అనే మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ మూవీలో విజయ్ తొలిసారి సైనికుడిగా నటించబోతున్నాడు. మొన్నామధ్య ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. ‘లైగర్’ సినిమా విడుదలైన వెంటనే ‘జనగణమన’ చిత్రం పట్టాలెక్కబోతోంది. దేశంలో ప్రజాస్వామ్యం పనిచేయనప్పుడు సైనిక పాలన వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో పూరీ ఈ కథ రాసుకున్నారు. ‘ఒకే ఒక్కడు’ (Oke Okkadu) చిత్రంలో ఒకరోజు సీయం కాన్సెప్ట్ లా ‘జనగణమన’ లో ఎన్నో విభిన్నమైన టాపిక్కుల్ని పూరీ టచ్ చేయబోతున్నాడని టాక్. అందులో కొన్ని వివాదాత్మక అంశాలూ ఉంటాయని తెలుస్తోంది. 


అసలు విషయానికొస్తే .. ‘జగగణమన’ చిత్రంలోని విజయ్ పాత్ర పూర్తిగా పూరీ  ఇజమ్ తోనే డిజైన్ చేశారట. పూరీ మ్యూజింగ్స్ (Puri Musings) ఎంత ఫేమసో తెలిసిందే. వివిధ అంశాలపై పూరీ చేసే ఆడియోలకు జనం బాగా కనెక్ట్ అవుతారు. ఇందులో పూరీ తన అభిప్రాయాల్ని సూటిగా సుత్తిలేకుండా చెబుతుంటారు. పూరీ తత్వం, వ్యక్తిత్వం, ఆయన ఇజం అన్నీ.. ఆ మాటల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఆ మాటలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పూరీ ఆఫీస్‌కు వెళితే.. గోడలనిండా ఆయన సొంత కొటేషన్స్ కనిపిస్తాయి. అవన్నీ ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే. త్వరలోనే పూరీ మ్యూజింగ్స్ పుస్తకంగా కూడా రాబోతోంది. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమనలోనూ ఇవే భావాలు కనిపిస్తాయని వినికిడి. 


పూరీ సినిమాల్లో హీరోల కేరక్టరైజేషన్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయి. అల్లరి చిల్లరగా ప్రవర్తించినా వారి మాటల్లో ఫిలాసఫీ ధ్వనిస్తుంటుంది. అదంతా పూరీ ఇజమే. అయితే ఇప్పటివరకూ వచ్చిన అన్ని సినిమాల్లోనూ హీరోచేత ఆ ఫిలాసఫీని కొంతే పలికించారు. ‘జగగణమన’ మూవీలో మాత్రం పూర్తి స్థాయిలో పూరీ ఇజమ్ కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమాకి విజయ పాత్ర చిత్రణ హైలైట్ అని చెబుతున్నారు. 

Updated Date - 2022-08-08T18:34:47+05:30 IST