‘మెయిన్ సోలా బరస్ కీతో’ పంజాబీ చిత్రంతో సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నటి నీరూ బజ్వా (Neeru Bajwa). హైస్కూల్ డ్రాపౌట్ అయిన ఈ కెనడియన్ భారతీయ మహిళ అయిన గ్లామర్ ప్రపంచంపై ఇష్టంతో అటువైపు అడుగులు వేసింది. పంజాబీ (Punjabi)లో తీసిన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. అనంతరం కూడా మంచి సినిమాలు చేసిన నటిగా మంచి గుర్తింపు సాధించింది. ఈ నటికి ఇప్పటికే పెళ్లికాగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ తరుణంలో ఈ బ్యూటీ ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో నీరూ బెబీ బంప్‌తో కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నీరూ నాలుగో బిడ్డకి తల్లి కాబోతోంది అని వార్తలు చేశాయి. పలువురు నెటిజన్లు ఈ భామకి విషెస్ చెబుతూ కామెంట్స్ చేశారు. ఈ తరుణంలో ఈ వైరల్ వీడియోపై తాజాగా నీరూ స్పందిస్తూ అసలు నిజాన్ని బయటపెట్టింది.
జులై 28న నీరూ షేర్ చేసిన ఆ వీడియోలో ఆమె బెబీ బంప్(Baby Bump)తో ఉన్న పలు ఫొటో ఉన్నాయి. అంతేకాకుండా ఆ పోస్ట్‌కి.. ‘మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు, ఆగస్టు 11, 2022న నా సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకోండి’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అని భావించిన నెటిజన్లు, ఆమె అభిమానులు వరుసగా శుభాకాంక్షల వర్షం కురిపించారు. అయితే.. ఆ వీడియోలో షేర్ చేయడానికి అసలు కారణాన్ని తెలుపుతూ ఈ బ్యూటీ మరో పోస్టుని జులై 29న పోస్టు చేసింది.
అది నీరూ కొత్తగా నటించిన ‘బ్యూటిఫుల్ బిల్లో’ మూవీ పోస్టర్. అందులో ఈ భామ ప్రెగ్నెంట్‌గా కనిపించనుంది. దానికి సంబంధించిన పిక్స్‌నే ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో షేర్ చేసింది ఈ భామ. ఈ తాజా పోస్ట్‌కి.. ‘బిల్లో తల్లి కాబోతోంది. ఆగస్టు 11న బిల్లోని జీ5లో చూడండి’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ పోస్టు వెనుకున్న అసలు అంతర్యం ఏంటో అందరికీ అర్థమైపోయింది. అది ఆమె కొత్త సినిమా కోసం చేసిన గిమ్మిక్కు అని అందరూ తెలుసుకున్నారు. దీంతో ఈ పోస్ట్‌పై సైతం పలువురు స్పందిస్తూ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.