‘రావణాసుర’లో ‘రంగస్థలం’ బ్యూటీ?

ABN , First Publish Date - 2022-01-21T16:58:27+05:30 IST

నేచురల్ స్టార్ రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా’ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అతి త్వరలో ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీకూడా సెట్స్‌పైకి వెళ్ళబోతోంది. ఇక తాజాగా ‘రావణాసుర’ చిత్రం షూటింగ్ కూడా మొదలైంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఆసక్తికరమైన కథాకథానాల్ని ఎంచుకున్నారు. ఇందులో సుశాంత్ ‘రామ్’ అనే పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈసినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్ తో పాటు పూజితా పొన్నాడ కూడా ఇందులో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె విలన్ గా నటించబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి దక్షా నగార్కర్ విలన్ గా నటిస్తోందని ముందుగా వార్తలొచ్చాయి. అయితే విలన్ గా నటించేది పూజితా పొన్నాడ అని తాజా సమాచారం. ‘రంగస్థలం’ చిత్రంలో ప్రకాశ్ రాజ్ కూతురుగా నటించి మంచి పేరు తెచ్చుకుంది పూజిత. ఆది పినిశెట్టి ప్రియురాలిగా సినిమాని కీలకమలుపు తిప్పే పాత్ర పోషించిందామె. ‘రావణాసుర’ చిత్రానికి కూడా పూజిత పాత్ర హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని నేచురల్ లొకేషన్స్ లో మాత్రమే చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఎలాంటి సెట్టింగ్స్  లేకుండా.. ఔట్ డోర్ లొకేషన్స్ లోనే షూటింగ్ జరగబోతోంది. అది కూడా హైదరాబాద్ లోనే అని సమాచారం. మరి పూజిత ‘రావణాసుర’ చిత్రంతో ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-01-21T16:58:27+05:30 IST