'పుష్ప' హిందీ వెర్షన్ టీజర్‌తో ప్రమోషన్స్ షురూ..

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప'. ఈ మూవీ హిందీ వెర్షన్ ప్రమోషన్స్ తాజాగా బాలీవుడ్‌లో మొదలయ్యాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నీ భాషలలోనూ చిత్ర ప్రమోషన్స్‌ను భారీగా ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాతో సుకుమార్, అల్లు అర్జున్ హిందీ మార్కెట్‌పై బాగా గ్రిప్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. కాగా, పుష్ప హిందీ టీజర్‌ను ఇప్పుడు నార్త్‌సైడ్ థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారట. ఈ టీజర్‌కు హిందీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ త్వరలో ట్రైలర్ రిలీజ్ కానుంది. సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.